మన తెలుగు స్మాల్ స్క్రీన్ సెన్సేషనల్ రియాలిటీ షో బిగ్ బాస్ కోసం అందరికీ తెలిసిందే. మరి బిగ్ బాస్ సీజన్ మొత్తం 9 సీజన్స్ ని ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. కొన్ని నెలల కితం మొదలైన 9వ సీజన్ అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ని థ్రిల్స్ ని పంచి నేటితో ముగిసిపోయింది. కింగ్ నాగ్ సారథ్యంలో గ్రాండ్ గా జరిగిన ఫినాలే ఎపిసోడ్ లో నేడు విన్నర్ గా అందరూ ఊహించిన కంటెస్టెంట్ కళ్యాణ్ పడల సొంతం చేసుకున్నాడు.
ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంటర్ అయ్యి తనదైన ఆట తీరుతో చివరి క్షణం వరకు పోరాడి ప్రఖ్యాతి చెందిన బిగ్ బాస్ విన్నర్ కిరీటాన్ని తాను సొంతం చేసుకున్నాడు. దీనితో బిగ్ బాస్ హిస్టరీ లో మరో కామన్ మ్యాన్ గా తాను నిలిచాడు. తనకి ముందు కామన్ మ్యాన్ గా వెళ్లి పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక కళ్యాణ్ అభిమానులు ఈ హిస్టారికల్ మూమెంట్ తో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#BiggBossTelugu9 crown goes to #Kalyanpadala, From commoner to ultimate champion ????️????#BiggBossTelugu9 #BiggBossTelugu9GrandFinale pic.twitter.com/NWXqZY1Esp
— Starmaa (@StarMaa) December 21, 2025


