దుల్కర్ “లక్కీ భాస్కర్” సెట్స్‌లోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ!

దుల్కర్ “లక్కీ భాస్కర్” సెట్స్‌లోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ!

Published on Feb 26, 2024 4:26 PM IST

మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్కీ భాస్కర్. ఈ చిత్రం లో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో మరొక బ్యూటీ అయేషా ఖాన్ కనిపించనుంది. బిగ్ బాస్ 17 తో ఎంతో క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరియు ఓం భీమ్ బుష్ చిత్రాలలో కూడా కనిపించనున్నారు.

అయేషా ఖాన్ ప్రస్తుతం లక్కీ భాస్కర్ సెట్స్‌లో చేరారు. ఆమె పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు