గంజాయి తో పోలీసులకు పట్టుబడిన బిగ్ బాస్ ఫేమ్ “షణ్ముఖ్ జస్వంత్”

గంజాయి తో పోలీసులకు పట్టుబడిన బిగ్ బాస్ ఫేమ్ “షణ్ముఖ్ జస్వంత్”

Published on Feb 22, 2024 12:00 PM IST

యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్. బిగ్ బాస్ రియాలిటీ షో తో మరింత పాపులారిటీ ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అనుకొని విధంగా పోలీసులకు గంజాయి, డ్రగ్స్ తో పట్టుబడ్డాడు. షణ్ముఖ్ సోదరుడు అయినటువంటి సంపత్ వినయ్ పై కొద్ది రోజుల క్రితం పోలీస్ కేస్ నమోదు అయ్యింది. ఓ యువతి తో మూడేళ్ల క్రితం ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆ యువతి డాక్టర్ కాగా, ఆమె తల్లి ఆరోగ్యం బాగాలేక పోవడం తో చికిత్స ఇప్పించే క్రమం లో పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. అయితే మరో ఆరు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు సంపత్.

యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతని సోదరుడు శన్ముఖ్ ఫ్లాట్ లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమం లో డ్రగ్స్ మరియు గంజాయి తో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు షణ్ముఖ్. మరో ప్లేస్ లో దొరికిన సంపత్ వినయ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో యాక్సిడెంట్ కేస్ లో షణ్ముఖ్ నిందితుడు గా ఉన్నారు. మరోసారి ఈ వ్యవహారం లో పట్టుబడటం అనేది ఆతని అభిమానుల్లో కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు