బిగ్ బాస్ సోహైల్ కొత్త చిత్రం ప్రారంభం, త్వరలో రెగ్యులర్ షూటింగ్

బిగ్ బాస్ సోహైల్ కొత్త చిత్రం ప్రారంభం, త్వరలో రెగ్యులర్ షూటింగ్

Published on Mar 3, 2021 4:04 PM IST

జార్జ్ రెడ్డి, ప్రజర్ కుక్కర్ ల నిర్మాత అప్పి రెడ్డి, తన మూడవ చిత్రాన్ని బిగ్ బాస్ ఫేం సోహైల్ తో నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా మైక్ మూవీ నుండి ‘‘జార్జి రెడ్డి” , ‘‘ప్రెషర్ కుక్కర్” వంటి మూవీస్ తీశాం అవి ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడవ సినిమాను కొత్త డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి తో కలసి బిగ్ బాస్ ఫేం సోహైల్ హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాం..ఇప్పటివరకు భారతదేశ చిత్ర చరిత్రలో రాని ఓ కొత్త పాయింట్ తో ఈ సినిమా ఉంటుంది.భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాం. ఈ సినిమాకు చాలా మంది టాలెంటెడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాం.” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు