‘బిగ్ బాస్ 10’ వచ్చేస్తోంది.. నాగ్ నుంచి స్పెషల్ వీడియో !

‘బిగ్ బాస్ 10’ వచ్చేస్తోంది.. నాగ్ నుంచి స్పెషల్ వీడియో !

Published on Jun 7, 2026 5:04 PM IST

‘బిగ్ బాస్’ బుల్లి స్క్రీన్ ను ఎంతటి ఉరూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పక్కనర్లేదు. ఇప్పటికే 9 సీజన్లతో వినోదం పంచిన ఈ కార్యక్రమం 10వ సీజన్‌ త్వరలోనే రాబోతుంది. హోస్ట్‌ నాగార్జున ఈ గుడ్‌న్యూస్‌ చెబుతూ.. స్పెషల్‌ వీడియో షేర్ చేశారు. ‘‘బిగ్‌బాస్‌.. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతోమంది హృదయాలు గెలుచుకున్న మహా సామ్రాజ్యం’’ అంటూ నాగార్జున చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో ప్రారంభమైన ఈ వీడియో బాగానే ఆకట్టుకుంది.

పైగా బిగ్‌ బాస్‌ పై రూపొందించిన పాట వీడియోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ‘ఆటలో సవాలు కాదు.. ఆటే సవాలు’ అన్న క్యాప్షన్‌తో కొత్త సీజన్‌ ఎంత రసవత్తరంగా ఉండబోతుందో మొత్తానికి నాగ్ హింట్‌ ఇచ్చారు. ఇప్పటికే, చాలామంది బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టి, తమ టాలెంట్‌ చూపించుకున్నారు. కామన్ మ్యాన్ లు సైతం సెలబ్రిటీలకు గట్టి పోటీ ఇచ్చారు. మరి ఈ సారి కంటెస్టెంట్‌లు ఎవరో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు