‘టాక్సిక్’ ని మించిన బిగ్ డిజాస్టర్.. అదే నిర్మాణ సంస్థకి.. ఇక “కాకా”నే కాపాడాలా!

ఈ ఏడాదిలో ఇండియన్ సినిమా నుంచి భారీ హైప్ నడుమ విడుదలకి వచ్చి అంతే గ్రాండ్ ఓపెనింగ్స్ సాధించిన సినిమానే టాక్సిక్. కన్నడ రాకింగ్ స్టార్ హీరోగా నటించిన ఈ సినిమాని కన్నడ నిర్మాణ సంస్థ కే వి ఎన్ వారు నిర్మాణం వహించారు. కానీ సీన్ కట్ చేస్తే ఈ సినిమా 100కోట్లకి పైగానే నష్టాలు మిగిల్చింది.

ఇక ఇదే పెద్ద డిజాస్టర్ అనుకుంటే దీనికి మించి అదే నిర్మాణ సంస్థ తెరకెక్కించిన బాలీవుడ్ సినిమా ‘హైవాన్’ నిలిచినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్స్ నటించినప్పటికీ ఈ సినిమా క్లోజింగ్ వసూళ్లు 10 కోట్లలోపే ఉంటాయట. ఈ సినిమా 130 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఇక మిగతా అంతా నష్టాలే అని తెలుస్తోంది.

దీనితో కే వి ఎన్ సంస్థకి భారీ నష్టాలు తప్పలేదు అని చెప్పాలి. వరుసగా మూడు ప్లాప్ లు ఈ నిర్మాణ సంస్థకి ఎదురయ్యాయి. సో వీటిని మించి మొదటి హిట్ మాత్రం మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న కాకా నే అందిస్తుందా అని చెప్పాలి. తెలుగులో ఈ నిర్మాణ సంస్థ చేస్తున్న మొదటి సినిమా కావడం, గ్రాండ్ గా కూడా లాంచ్ చేశారు. సో ఇన్ని వరుస ప్లాప్ ల నుంచి ఆఖరికి మెగాస్టార్ నే ఈ సంస్థని సేవ్ చేస్తారా అనేది చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా మేకర్స్ ఇప్పుడు పని చేస్తున్నారు. సో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Exit mobile version