ఓటిటిలో “కల్కి” నుంచి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అట

ఓటిటిలో “కల్కి” నుంచి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అట

Published on May 30, 2024 1:29 PM IST


ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ చిత్రాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు నటిస్తున్న భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” కూడా ఒకటి. అయితే థియేటర్స్ రిలీజ్ కంటే ముందు ఓటిటిలో ఓ క్రేజీ ప్రీల్యూడ్ ని మేకర్స్ ఓటిటిలో రిలీజ్ చేస్తారని ఎప్పుడు నుంచో వినిపిస్తున్న మాట.

మరి దీనిని అయితే ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Prime Video) వారు అనౌన్స్ చేశారు. ఇక ఈ అవైటెడ్ యానిమేటెడ్ ప్రీల్యూడ్ ని ఈ అర్ధ రాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ కి తీసుకురానున్నారు. అయితే ఈ ఓటిటిలోకి వస్తున్నా ఈ ట్రీట్ లో ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉందని ఇప్పుడు మేకర్స్ చెప్తున్నారు.

మరి అదేంటో తెలియాలి అంటే ఈ రాత్రి 12 గంటలు వరకు ఆగాల్సిందే. ఇక బుజ్జి అండ్ భైరవ ఈ యానిమేటెడ్ వీడియోలో ఎలాంటి ట్రీట్ ని పంచుతారా అని పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు