సూపర్ స్టార్ తలపతి విజయ్ లేటెస్ట్ మూవీ బిగిల్. యంగ్ డైరక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది. విజయ్ సరసన హీరోయిన్ గా నయనతార నటించిన ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈనెల 19న ఈ మూవీ ఆడియో వేడుకను చెన్నైలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. కాగా ఈవేడుక నిర్వహణకు అనుమతులు ఇచ్చిన కారణంగా సదరు కాలేజ్ యాజమాన్యం చిక్కుల్లో పడింది.
తాజా సమాచారం ప్రకారం తమిళనాడు హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డు బిగిల్ మూవీ ఆడియో వేడుక నిర్వహణకు పర్మిషన్ ఇచ్చిన విషయంపై వివరణ ఇవ్వవలసిందిగా కాలేజ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. దీనికి సంబంధించి వారికి నోటీసులు జారీ చేశారట. సరైన కారణాలు ఇవ్వకపోయినా, ఇచ్చిన వివరణతో బోర్డు ఏకీభవించకున్నా కాలేజ్ పర్మిషన్ రద్దయ్యే అవకాశం కలదు. సిటీకి దూరంగా ఉన్న సాయి రామ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ వేడుక నిర్వహించడం జరిగింది.


