రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బిగిల్

రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన బిగిల్

Published on Oct 19, 2019 3:06 PM IST

తలపతి విజయ్ నటించిన మచ్ అవైటింగ్ మూవీ బిగిల్ ఇంకా ఆరురోజులలో థియేటర్లలో దిగనుంది. దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల అవుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మూవీపై ఉన్న హైప్ రీత్యా బిగిల్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దుమ్మురేపింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ 140కోట్ల వరకు ప్రీరిలీజ్ బిసినెస్ జరిపిందని సమాచారం. ఈ మూవీ బడ్జెట్ కూడా 180కోట్ల వరకు ఐయ్యిందని తెలుస్తుంది. ఇంకా తెలుగులో కూడా ఈ చిత్ర హక్కుల కొరకు 9-10 కోట్ల వరకు వెచ్చించారని వినికిడి.విజయ్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఇది భారీ రేటుగా చెప్పవచ్చు.

అదిరింది మూవీ తరువాత విజయ్ కి తెలుగులో మార్కెట్ పెరిగింది. అట్లీ మరియు విజయ్ లది హిట్ కాంబినేషన్ కావడంతో మూవీ విజయం పై చాలా నమ్మకంగా ఉన్నారు నిర్మాతలు. ఇక విజయ్ మూడు విభిన్న గెటప్స్ లో కనిపిస్తుండగా లేడీ సూపర్ స్టార్ నయనతార విజయ్ కి జంటగా నటిస్తుంది. తెలుగులో విజిల్ గా విడుదల అవుతున్న ఈ చిత్ర మ్యూజిక్ రెహమాన్ కంపోజ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు