కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమా అట !

కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమా అట !

Published on Feb 4, 2019 6:18 PM IST

bhilal pur

నాగసాయి మాకం దర్శకత్వంలో ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళి శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం ‘బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్’. మాగంటి శ్రీనాథ్, సాన్వీ మేఘనా జంటగా నటించారు. గోరేటి వెంకన్న ఓ కీలక పాత్ర పోషించారు. కాగా ఈ బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. మార్చి రెండో వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మహంకాళి శ్రీనివాస్ మాట్లాడుతూ… మంచి కథకు నిర్మాణ విలువలు తోడయితేనే ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్ద నిర్మాణ సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రాన్ని నిర్మించాము. మార్చి రెండో వారంలో ఒక పెద్ద పంపిణీ సంస్థ ద్వారా వీలైనన్ని ఎక్కువ కేంద్రాల్లో బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

దర్శకుడు నాగసాయి మాకం మాట్లాడుతూ..కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునే ఒక చిత్రాన్ని మేము రూపొందించాం. ఇందులో ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేని కథా కథనాలు ఉంటాయి. బిలాల్ పూర్ అనే ఊరి పోలీస్ స్టేషన్ కు వచ్చే వింత వింత కేసులు కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమా చూస్తున్న వాళ్లకు తమ ఊరిలో జరిగే సంఘటనలు గుర్తొస్తాయి. సినిమా ఆద్యంతం సహజమైన పాత్రలతో, సన్నివేశాలతో సాగుతుంటుంది. అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – తోట వి రమణ, ఎడిటింగ్ – ఎస్ బీ ఉద్ధవ్, సంగీతం – సాబూ వర్గీస్, కథా, నిర్మాత – మహంకాళి శ్రీనివాస్, రచన, దర్శకత్వం – నాగసాయి మాకం.

తాజా వార్తలు