అజిత్ బర్త్ డే కి “బిల్లా” స్పెషల్ షోస్!

అజిత్ బర్త్ డే కి “బిల్లా” స్పెషల్ షోస్!

Published on Apr 26, 2024 7:07 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో, దర్శకుడు విష్ణు వర్ధన్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ బిల్లా. ఈ చిత్రం 2007 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. అయితే మే 1 వ తేదీన హీరో అజిత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం కి సంబందించిన స్పెషల్ షోస్ ను ప్రదర్శించనున్నారు.

తమిళనాడు రాష్ట్రం లో మే 1 వ తేదీన మొత్తం 150 కి పైగా స్క్రీన్ లలో ఈ చిత్రం ప్రదర్శింప బడుతుంది. ప్రభు, రహ్మాన్, నయనతార, నమిత కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ స్పెషల్ షోస్ కి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు