తమిళ రాజకీయ, సామాజిక చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి వేలుపిళ్లై ప్రభాకరన్. శ్రీలంకలో ఎల్టీటీఈ అనే తిరుగుబాటు సంస్థను స్థాపించి తమిళుల హక్కుల కోసం పోరాడి 2009లో మరణించిన ఈయన జీవితం ఆధారంగా తమిళ సినీ పరిశ్రమలో ఒక బయోపిక్ తెరకెక్కనుంది.
దర్శకుడు వెంకటేష్ కుమార్. జి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని స్టూడియో 18 నిర్మించనుంది. ఈ నెలలోనే సినిమా మొదలుకానుంది. అయితే ఇందులో ప్రభాకరన్, ఇతర ముఖ్యుల పాత్రల్ని ఎవరు పోషిస్తారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. శ్రీలంక, తమిళనాడు ప్రభుత్వాలు ఎంతో సున్నితంగా భావించే ఈ ప్రభాకరన్ అంశంపై సినిమా చేయాలని గతంలోనే పలువురు దర్శకులు, నిర్మాతలు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.


