పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హీరోయిన్స్ శ్రీలీల అలాగే రాశి ఖన్నా కాంబినేషన్ లో దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ వచ్చిన మొదటి సాంగ్ ఫ్యాన్స్ ని అలరించిందని తెలిసిందే. ఇక నెక్స్ట్ సాంగ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ దీనిపై లేటెస్ట్ అప్డేట్ అందించారు.
ఉస్తాద్ భగత్ సింగ్ లో ఒక బ్లాక్ బస్టర్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ రెడీ చేస్తున్నట్టుగా దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ ఈ సాంగ్ ని కస్టపడి రచిస్తునట్టు కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసి తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆరా కి తగ్గట్టుగా ఈ సాంగ్ ఉంటుంది అని తాను చెబుతున్నారు. మరి ఈ సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


