“మన శంకర వరప్రసాద్ గారు” ఫస్ట్ వీక్ కలెక్షన్స్ !

“మన శంకర వరప్రసాద్ గారు” ఫస్ట్ వీక్ కలెక్షన్స్ !

Published on Jan 19, 2026 12:00 PM IST

Mana Shankara Vara Prasad Garu

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu). ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని బ్లాక్‌ బస్టర్ విజయాన్ని సాధించింది. ఐతే, బాక్సాఫీస్ వద్ద మొదటి వారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 292 కోట్ల భారీ వసూళ్లను రాబట్టింది. ఇదే జోరు కొనసాగితే, ప్రతిష్టాత్మకమైన రూ. 300 కోట్ల మార్కును కూడా ఈ సినిమా కొన్ని గంటల్లోనే చేరుకుంటుంది. ఈ అద్భుతమైన విజయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ ఆరంభం దక్కింది అనుకోవాలి.

మొత్తమ్మీద ఈ సినిమాకి వస్తున్న భారీ కలెక్షన్లను బట్టి.. సంక్రాంతి విన్నర్ “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Vara Prasad Garu) అని తేలిపోయింది. పైగా రాబోయే వారంలో ఈ చిత్రానికి పెద్దగా పోటీ కూడా లేదు. కాబట్టి, రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని వసూళ్లను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ఎలాగూ ఈ సినిమాకి ఇంకా ప్రమోషన్స్ ను కూడా బలంగా చేస్తున్నారు. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్ లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు

Mana Shankara Vara Prasad Garu

సంబంధిత సమాచారం

తాజా వార్తలు