‘పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ’ సినిమాలకు దర్శకత్వం వహించిన బాబి నిర్మాతగా మారబోతున్నాడు. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ మూవీ డైరెక్టర్ అరుణ్ పవర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఒక యంగ్ హీరో ఈ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతోంది.
అరుణ్ పవర్ చెప్పిన పాయింట్ నచ్చి బాబి ఈ సినిమాను నిర్మించడానికి స్వయంగా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. యూత్ ఫుల్ సబ్జెక్టుతో ఈ సినిమా రుపొందనుంది. బాబి దర్శకుడిగా వెంకటేష్, నాగ చైతన్యతో సినిమా చేయబోతున్నాడు. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో సమంత, నయనతార నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
