విడుదలకు సిద్ధమైన బాడీగార్డ్ ఆడియో

విడుదలకు సిద్ధమైన బాడీగార్డ్ ఆడియో

Published on Nov 29, 2011 11:12 AM IST


వెంకటేష్ ఈసారి ‘బాడీగార్డ్’ చిత్రంతో మన ముందుకి రానున్నారు. మలయాళంలో వచ్చిన బాడీగార్డ్ చిత్రానికి రిమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. త్రిషా హీరోయిన్ గా నటిస్తుండగా సలోని కీలక పాత్ర పోషిస్తుంది. సున్నితమైన ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంపన్న యువతిని కాపాడే బాడీగార్డ్ పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో డిసెంబరు 13న విడుదల కానుంది.

గతంలో ఈ చిత్రాన్ని తమిళ్, హిందీలో రేమకే చేయగా రెండు భాషల్లోనూ భారీ విజయాలు సాధించాయి. సంక్రాంతికి విడుదల కానున్న బాడీగార్డ్ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు