మహేష్ బాబు కోసం పాట పాడిన బాలీవుడ్ నటుడు !


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం ‘భరతన్ నేను’ ఏప్రిల్ 20న విడుదలకానుంది. అలాగే ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది. ఈలోపు చిత్ర టీమ్ ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఆల్బమ్ నుండి ‘భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను’ పాట విడుదలకాగా రేపు 1వ తేదీన ‘ఐ డోంట్ నో’ సాంగ్ రిలీజ్ కానుంది.

ఈ పాటను బాలీవుడ్ నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు అయిన ఫర్హాన్ అఖ్తర్ పాడటం విశేషం. స్పెయిన్ లో చిత్రీకరించబడిన ఈ పాటే సినిమాలో మహేష్ బాబు యొక్క ఇంట్రో సాంగ్ గా ఉంటుందని కూడ తెలుస్తోంది. మహేష్ బాబుకు మంచి స్నేహితుడైన ఫర్హాన్ గతంలో కూడ పలు బాలీవుడ్ సినిమాల్లో సూపర్ హిట్ పాటలను పాడారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అద్వానీ కథానాయకిగా కనిపించనుంది.