మరింత గ్రాండ్ గా మారుతున్న ఎన్టీఆర్ “డ్రాగన్”.. బాలీవుడ్ బిగ్ స్టార్ల పేర్లు?

మరింత గ్రాండ్ గా మారుతున్న ఎన్టీఆర్ “డ్రాగన్”.. బాలీవుడ్ బిగ్ స్టార్ల పేర్లు?

Published on Sep 3, 2026 5:08 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ సినిమా డ్రాగన్ కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా మళ్లీ మరో రెండు వారాల్లో పునః ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ గ్యాప్ లో డ్రాగన్ పై పలు ఊహించని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమా ఉండగా ఉండగా మరింత భారీ లెవెల్లోకి వెళుతున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ బాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు అనీల్ కపూర్ ఈ సినిమాలో ఉన్న సంగతి తెలిసిందే. తన తర్వాత ఇప్పుడు బిగ్ స్టార్స్ షాహిద్ కపూర్ అలాగే ఆలియా భట్ లు పేర్లు కూడా ఈ సినిమా తారాగణంలో యాడ్ అయినట్టు తెలుస్తోంది.

మరి ఇదే నిజం అయితే డ్రాగన్ మరింత లెవెల్ కి వెళ్లినట్టే అని చెప్పాలి. అలాగే నార్త్ బెల్ట్ లో వసూళ్లకు ఇది మరింత బూస్టప్ గా నిలిచే అవకాశం ఉంది. షాహిద్ మలయాళ నటుడు టోవినో థామస్ కి రీప్లేస్ గా కనిపిస్తాడని టాక్. కానీ ప్రస్తుతానికి అయితే ఇందులో ఎలాంటి నిజం లేదు. సో దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు