పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ హీరోయిన్ ఇమాన్వి హీరోయిన్ గా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ యాక్షన్ చిత్రం ఫౌజీ కోసం అందరికీ తెలిసిందే. ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ నుంచి ఆల్రెడీ వచ్చిన పోస్టర్ లు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక నెక్స్ట్ రానున్న మిగతా కంటెంట్ పై మైత్రి నిర్మాత నవీన్ యెర్నేని క్లారిటీ ఇచ్చేసారు.
ఈ నెల నుంచి ఫౌజీ కంటెంట్ రిలీజ్ చేస్తున్నట్టు ఖరారు చేసారు. అంతే కాకుండా నెక్స్ట్ రానున్న ప్రతీ కంటెంట్ కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేసే దానిలానే ఉంటాయని కూడా ఖాయం చేశారు. సో ప్రభాస్ ఫౌజీ నుంచి నెక్స్ట్ అంతా విధ్వంసమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ 2న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.


