“లక్ష్మి బాంబ్” పేలేది ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యింది.!

Published on Sep 16, 2020 4:27 pm IST

ప్రస్తుతం డిజిటల్ రిలీజ్ లు ఊపందుకున్న సంగతి తెలిసిందే. మన దక్షిణాది నుంచి అయితే భారీ చిత్రాలు ఏవి డిజిటల్ రిలీజ్ కు రావడం లేదు కానీ బాలీవుడ్ వర్గాలలో అయితే చాలానే సినిమాలు వరుసలో ఉన్నాయి. అలాంటి వాటిలో బాలీవుడ్ స్టార్ హీరో నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “లక్ష్మి బాంబ్” కూడా ఒకటి.

రాఘవ లారెన్స్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం “కాంచన” తెలుగు మరియు తమిళ్ లో భారీ హిట్ కావడంతో హిందీలో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎప్పుడో అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో విడుదలకు సన్నద్ధం అయ్యింది కానీ ఎప్పుడు విడుదల చేస్తారు అన్నది మాత్రం ఇన్ని రోజులు ఖరారు చెయ్యలేదు.

కానీ ఇప్పుడు మొత్తానికి ఈ చిత్రం స్ట్రీమింగ్ రిలీజ్ కు ఒక డేట్ ను తెచ్చుకుంది. ఈ చిత్రం అనుకున్నట్టుగానే ఈ దీపావళి సీజన్ కు అందుబాటిలో ఉండనుంది. వచ్చే నవంబర్ 9 న ఈ లక్ష్మి బాంబ్ విస్ఫోటనం ఉండనుంది అని ఇపుడు బాలీవుడ్ సినీ వర్గాల్లో కన్ఫర్మ్ అయ్యింది. సో చాలా కాలం తర్వాత బాలీవుడ్ నుంచి ఒక భారీ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది. మూడు ఛాలెంజింగ్ రోల్స్ లో కనిపించనున్న అక్షయ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం :

More