పెద్ద సినిమాలన్నీ వెనక్కు వెళ్తున్నాయి

Theater
బాలీవుడ్ పరిశ్రమను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ ముగిసి ఇన్ని నెలలు అవుతున్నా కూడ సినిమా హాళ్లు పూర్తిగా కోలుకోలేదు. పెద్ద సినిమాలు రిలీజ్ కావట్లేదు. కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే హాళ్లు నడువడంతో ఎగ్జిబిటర్లు భారీ నష్టాలను చూస్తున్నారు. దీనికి తోడు తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్లను పూర్తిగా ఏప్రిల్ 30 వరకు మూసివేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ 50 శాతం ఆక్యుపెన్సీ రాబడి కూడ పోయినట్లైంది. ఈ మూసివేత ఏప్రిల్ 30 వరకేనా లేకపోతె ఇంకా పొడిగించబడుతుందా అనేది స్పష్టతలేని విషయం.

ఇక ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన పెద్ద సినిమాలన్నీ వరుసగా వాయిదాపడుతున్నాయి. ఇప్పటికే అక్షయ్ కుమార్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో చేసిన ‘సూర్యవన్షి’ ఏప్రిల్ బరి నుండి తప్పుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఇంకొన్ని పెద్ద సినిమాలు ‘రాధే, సత్యమేవ జయతే, షంషేరా’ కూడ పోస్ట్ ఫోన్ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్న, మీడియం స్థాయి సినిమాలు ఓటీటీలకు వెళ్లాలని అనుకుంటుంటే పెద్ద సినిమాలు మాత్రం ఎటూ పాలుపోని స్థితిలో పడిపోతున్నాయి.

Exit mobile version