మహేష్ బాబును కలవనున్న బాలీవుడ్ దర్శకుడు..?

మహేష్ బాబును కలవనున్న బాలీవుడ్ దర్శకుడు..?

Published on Nov 29, 2014 11:55 AM IST

Mahesh

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు, గాయకుడు అయిన ఫరాన్‌ అక్తర్‌ మహేష్ బాబును మీట్ అవ్వడం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఫరాన్‌ అక్తర్‌ హైదరాబాద్ విచ్చేశారు. ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబును కలవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు.

ప్రస్తుతం నా హైదరాబాద్ షెడ్యూల్‌ చాలా టైట్‌గా ఉంది. టైం దొరికితే మహేష్‌ బాబుని కలుద్దామనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలి అనే ఉద్దేశ్యంతో ఫరాన్‌ అక్తర్‌ ‘మర్ద్‌’ అనే క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. ఈ క్యాంపెయిన్‌ కోసం జావేద్ అక్తర్ (ఫరాన్‌ అక్తర్‌ తండ్రి) రాసిన కవిత్వాన్ని తెలుగులో మహేష్ బాబు పాడారు. ఆ గౌరవంతో మహేష్ ను ఫరాన్ అక్తర్ కలవనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు