స్టార్ హీరో ఇంట్లో బాంబ్ కలకలం

Published on Jul 19, 2020 4:16 pm IST

తమిళ్ స్టార్ హీరో అజిత్ ఇంటిలో బాంబు పెట్టినట్లు ఫోన్ రావడంతో ఆయన ఇంటి వద్ద కొంత హై డ్రామా నడిచింది. అప్రమత్తమైన పోలీసులు ఆయన ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అజిత్ ఇల్లంతా జల్లెడ పట్టిన పోలీసులు, బాంబ్ లేదని నిర్ధారించారు. అలాగే ఇది ఒక ఫేక్ కాల్ అని అభిప్రాయానికి వచ్చారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఆ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకొనే పనిలో పోలీసు సిబ్బంది ఉన్నారు.

ఇప్పటికే హీరో రజిని కాంత్, విజయ్ నివాసాలలో బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్స్ రావడం జరిగింది. అప్పుడు కూడా పోలీస్ సిబ్బంది ఇలానే ఇద్దరు హీరోల ఇళ్లల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆకతాయిలు, యాంటీ ఫ్యాన్స్ తరచుగా ఇలాంటి కాల్స్ చేస్తూ…పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నారు.

సంబంధిత సమాచారం :