రీ రిలీజ్ కి రెడీ అవుతున్న “బొమ్మరిల్లు”

రీ రిలీజ్ కి రెడీ అవుతున్న “బొమ్మరిల్లు”

Published on Feb 23, 2024 2:00 PM IST

టాలెంటెడ్ యాక్టర్ సిద్దార్థ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం బొమ్మరిల్లు. ఈ చిత్రం తోనే డైరెక్టర్ భాస్కర్, బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయారు. ఈ చిత్రం 2006 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగానే నడుస్తోంది. పలు హిట్ చిత్రాలు, ఫీల్ గుడ్ మూవీస్ రీ రిలీజ్ అవుతున్నాయి. ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పుడు బొమ్మరిల్లు చిత్రం కూడా రీ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏప్రిల్ నెలలో హీరో సిద్దార్థ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఓయ్! సినిమా ను రీ రిలీజ్ చేయగా, సూపర్ సక్సెస్ చేశారు ఆడియన్స్. మరి ఈ ఆల్ టైమ్ సూపర్ హిట్ మూవీ అయిన బొమ్మరిల్లు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ చిత్రం లో జెనీలియా హీరోయిన్ గా నటించగా, జయసుధ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అద్దిరిపోయే సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు