జాన్వీ ప్రియుడి పై బోనీకపూర్‌ కామెంట్స్

జాన్వీ ప్రియుడి పై బోనీకపూర్‌ కామెంట్స్

Published on Apr 1, 2024 5:01 PM IST

‘మైదాన్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత బోనీకపూర్‌ ఓ ఇంటర్వూ ఇచ్చారు. ఐతే, ఆ ఇంటర్వ్యూలో తన సతీమణి, దివంగత అతిలోక సుందరి శ్రీదేవి మరణం గురించి ప్రస్తావన వచ్చింది. వెంటనే.. బోనీకపూర్‌ భావోద్వేగానికి గురయ్యారు. తన భార్య శ్రీదేవిను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ బోనీకపూర్‌ చెప్పాడు. బోనీకపూర్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘శ్రీదేవిని నేను ప్రతిరోజూ, ప్రతిక్షణం మిస్‌ అవుతూనే ఉన్నాను’ అని బోనీకపూర్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

కాగా ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ సినిమా పై కూడా బోనీకపూర్‌ కామెంట్స్ చేశారు. మొదట ఆ సినిమాని ఐశ్వర్య రాయ్‌తో చేయాలనుకున్నారట. దీంతో ఆ సినిమా నిర్మాత బాల్కీతో బోనీకపూర్‌ మాట్లాడుతూ.. ఈ కథకు శ్రీదేవి కంటే బాగా న్యాయం చేసేవాళ్లు ఎవరూ లేరని చెప్పారట. అందుకే, ఆ సినిమాని శ్రీదేవితో తీశారట. తన కుమార్తె జాన్వీకపూర్‌ – శిఖర్‌ పహారియా రిలేషన్‌ గురించి కూడా బోనీకపూర్‌ స్పందిస్తూ.. ‘శిఖర్‌ పహారియా, జాన్వీతోపాటు మా అందరితో స్నేహంగా ఉంటాడు. మాతో ఇలాంటి వ్యక్తి ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం’’ అని బోనీకపూర్‌ చెప్పాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు