“కెమెరామెన్ గంగతో రాంబాబు” రీరిలీజ్ బుకింగ్స్ అప్డేట్.!

“కెమెరామెన్ గంగతో రాంబాబు” రీరిలీజ్ బుకింగ్స్ అప్డేట్.!

Published on Feb 2, 2024 6:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తమన్నా భాటియా హీరోయిన్ గా డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు”. మరి గత దశాబ్ద కాలం కితం రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం పలు కాంట్రవర్సీలను రేపగా ఇప్పుడు ఈ చిత్రం రీ రిలీజ్ కి లాక్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి లేటెస్ట్ గా ఈ చిత్రం డేట్ కూడా ఫిక్స్ అవ్వగా ఈ సినిమా బుకింగ్స్ పై అయితే నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు సాలిడ్ అప్డేట్ ని అందించారు.

దీనితో ఈ సినిమా తెలుగు స్టేట్స్ బుకింగ్స్ ఈ ఫిబ్రవరి 3న సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ చిత్రానికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా కొత్త శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అలాగే ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు