టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “బూట్ కట్ బాలరాజు”

టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన “బూట్ కట్ బాలరాజు”

Published on Apr 26, 2024 9:00 PM IST

సోహైల్, మేఘలేఖ, సునీల్, ఇంద్రజ, సిరి హనుమంత్, జబర్దస్త్‌ రోహిణి తదితరులు ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ కోనేటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ డ్రామా బూట్ కట్ బాలరాజు. ఈ చిత్రం ఫిబ్రవరి 2, 2024 న ధియేటర్లలో విడుదల అయ్యి ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన ఈటీవీ తెలుగు సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మే 5, 2024 న సాయంత్రం 5:00 గంటలకి ఈటీవీ తెలుగు లో ప్రసారం కానుంది. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు