బాలయ్యతో బోయపాటి రియలిస్టిక్ యాక్షన్ !

Published on Apr 2, 2020 2:00 am IST

నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ‘వినయ విధేయ రామ’ చిత్రం ప్లాప్ తరువాత బోయపాటి శ్రీను బాలయ్య సినిమా కోసం చాల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. కాగా ‘వినయ విధేయ రామ’ ప్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం సినిమాలో యాక్షన్ సీన్స్ అండ్ మెయిన్ ఎమోషన్ వాస్తవానికి మరి దూరంగా ఉండటమేనట. అందుకే బోయపాటి, బాలయ్యతో చేస్తోన్న సినిమాలో యాక్షన్ ను కాస్త నమ్మే విధంగా రియలిస్టిక్ గా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇక కరోనా ప్రభావం తగ్గాక రామోజీ ఫిల్మ్ సిటీలో తరువాత షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు.

ఇక ఈ చిత్రానికి సంభందించిన అప్ డేట్ కోసం బాలకృష్ణ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో బాలయ్య బాబు రెండు పాత్రల్లో కనిపిస్తుండటం, వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం, పైగా ఆ పాత్ర కోసం బాలయ్య గుండు చేయించుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి ఎక్కువవుతోంది. మరి బోయపాటి శ్రీరామనవమికైనా బాలయ్య బాబు ఫస్ట్ లుక్ వదులుతాడేమో చూడాలి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో అంజలి కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

X
More