బ్రహ్మజీ సైరా గెటప్ కోసం రంగంలోకి దిగిన చరణ్, సురేందర్ రెడ్డి

బ్రహ్మజీ సైరా గెటప్ కోసం రంగంలోకి దిగిన చరణ్, సురేందర్ రెడ్డి

Published on Oct 4, 2019 12:21 PM IST

Brahmaji

సీనియర్ నటుడు బ్రహ్మాజీ సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఓ ప్రాముఖ్యం ఉన్న పాత్ర చేసి అలరించారు. ఒడ్డె ఓబన్న పాత్ర కొరకు ఆయన గుండుతో కనిపించడం విశేషం. కాగా నేడు ట్విట్టర్ వేదికగా కొన్ని ఆసక్తికర ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే సైరా లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో ఓ పాత్ర ఇచ్చినందుకు నిర్మాత రామ్ చరణ్ కి ధన్యవాదాలు తెలిపారు.

“మెగాస్టార్ చిత్రంలో ఒక చిన్న రోల్ అడిగితే రామ్ చరణ్ ప్రాముఖ్యం ఉన్న పూర్తి స్థాయి పాత్రను నాకు ఇచ్చారు, ఆయన మేలు మరువలేను, అలాగే ఈ చిత్రంలో భాగస్వామ్యులైన దర్శకుడు సురేందర్ రెడ్డి, డీఓపీ రత్నవేలు అలాగే కొణిదెల ప్రొడక్షన్స్ కి నా ధన్యవాదాలు” అని బ్రహ్మజీ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ సందేశంతో పాటు సైరా షూటింగ్ సమయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ బ్రహ్మాజీ జుట్టు కత్తిరించడానికి సిద్దమైన ఫొటోతో పాటు, తాను గుండు గెటప్ లో ఉన్న ఫొటోలు షేర్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు