‘అభిమానితో తను.. అభిమానంతో నేను’ !

‘అభిమానితో తను.. అభిమానంతో నేను’ !

Published on Jul 2, 2019 3:56 PM IST

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వస్తోన్న బన్నీ 19వ సినిమా సెకండ్ షెడ్యూలకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే లాంగ్ బ్రేక్ అనంతరం మొదలైన ఈ రెండవ షెడ్యూల్ లో బన్నీతో పాటు సినిమాలోని మిగిలిన స్టార్ కాస్టింగ్ కూడా పాల్గొంటున్నారు. కాగా ఈ సినిమాలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం షూటింగ్‌ స్పాట్ లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తో తాను కలిసి దిగిన ఓ ఫోటోను బ్రహ్మాజీ ట్వీట్ చేస్తూ.. ఆ ఫోటోకి ఇంట్రస్టింగ్ క్యాప్షన్ ఇచ్చాడు.

బ్రహ్మాజీ కింద ఫోటో పోస్ట్ చేస్తూ.. ‘అభిమానితో తను.. అభిమానంతో నేను’ అని కామెంట్‌ పెట్టాడు. పైగా క్యాప్షన్ త్రివిక్రమ్‌ గారే హెల్ప్‌ చేశారని మళ్లీ మరో ట్వీట్ చేశాడు. మొత్తానికి ఈ ఫోటో ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బన్నీ గత చిత్రం ‘నా పేరు సూర్య’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రం పైనే బన్నీ అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు