
బ్రహ్మానందం.. తెలుగు సినిమా ప్రేక్షకులకు, హాస్య ప్రియులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. మూడు దశాబ్దాలుగా తన నటనతో, చిత్ర విచిత్ర ముఖ కవళికలతో ప్రేక్షకులను నవ్వించిన ఈ హాస్య బ్రహ్మ ఎన్నో రికార్డులను, మరెన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. 1000 సినిమాలలో నటించిన నటుడిగా సరికొత్త రికార్డు సృష్టించారు.
అయితే, బ్రహ్మానందంకు తను నటించిన 1000వ సినిమా ఏదో కచ్చితంగా గుర్తు లేదట. 997వ సినిమా వరకూ గుర్తుంది. తర్వాత బిజీ షెడ్యూల్, షూటింగుల వల్ల 1000వ సినిమా ఏదో అనే విషయం పెద్దగా పట్టించుకోలేదు. అని తెలిపారు. ప్రేక్షకులను నవ్వించగలిగే అదృష్టం ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
ప్రస్తుతం మహేష్ బాబు – కొరటాల శివల ‘శ్రీమంతుడు’, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ల ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తదితర సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

