ప్రముఖ హాస్య నటుడికి హార్ట్ సర్జరీ !

Published on Jan 16, 2019 10:00 am IST

తెలుగు తెర పై కమెడియన్ గా తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించి, తనధైన శైలిలో నవ్వులు పూయించిన ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం. తాజాగా బ్రహ్మి ఎన్టీఆర్ బయోపిక్ లో అలనాటి ప్రముఖ హాస్య నటుడు రేలంగి పాత్రలో నటించి మెప్పించారు.

కాగా ఇటీవలే ముంబై వెళ్లిన బ్రహ్మానందం అనారోగ్యానికి గురయ్యారట. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లగా పరీక్షలు చేసిన డాక్టర్స్ బ్రహ్మానందం హార్ట్ కు సంబంధించిన సమస్యతో బాధ పడుతున్నారని… ప్రముఖ హార్ట్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో బ్రహ్మానందానికి హార్ట్ సర్జరీ చేశారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత సమాచారం :

X
More