బ్రహ్మానందం హీరోగా ‘రబ్బర్ సింగ్’..

brahmanandam
స్టార్ ఇమేజ్ హోదా కలిగిన ఏకైక కమెడియన్ బ్రహ్మానందం. బ్రాహ్మీ లేని తెలుగు సినిమా, పప్పు అవకాయ్ లేని విందు భోజనం లాంటిది. ప్రతి పెద్ద సినిమాలో ఈ స్టార్ కమెడియన్ కామెడీ కంపల్సరీ అయ్యింది. మధ్యలో బ్రహ్మానందం హీరోగా కొన్ని సినిమాలలో నటించాడు. బ్రాహ్మీ హీరోగా నటించిన చివరి సినిమా ‘జఫ్ఫా’. వెన్నెల కిషోర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా నిరాశను మిగిల్చింది. అయితే, తాజాగా మరోసారి హీరోగా సందడి చేయడానికి రెడీ అయ్యాడట.

బ్రాహ్మీ హీరోగా నటించబోయే ఈ సినిమాకు ‘రబ్బర్ సింగ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. నాగేంద్ర ఈ సినిమాకు దర్శకుడు. ఫిబ్రవరి 27 నుండి రామానాయుడు స్టూడియోస్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. పవన్ ‘గబ్బర్ సింగ్’లో రికవరీ రంజిత్ గా అలరించిన బ్రాహ్మీ.. ‘రబ్బర్ సింగ్’లో ఎంత వినోదం పంచుతారో..! పవన్ సినిమాకు పేరడీ టైటిల్ కావడంతో సినిమాకు మంచి క్రేజ్ సంపాదించింది.

Exit mobile version