‘బ్రూస్ లీ’కి హైలైట్ కానున్న బ్రహ్మి – జెపి

jayaprakash-and-bhrami

యాక్షన్, సెంటిమెంట్ అనే అంశాలు ఎన్ని ఉన్నా కామెడీకి పెద్ద పీట వేసే డైరెక్టర్ శ్రీను వైట్ల. అలాంటి శ్రీనువైట్ల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి చేసిన సినిమా ‘బ్రూస్ లీ’. ఈ సినిమాలో ఫాదర్, సిస్టర్ సెంటిమెంట్ తో పాటు కామెడీకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎప్పటిలానే ఈ సినిమాలో కూడా శ్రీను వైట్ల బ్రహ్మానందం మరియు జయప్రకాష్ రెడ్డి లాంటి కమెడియన్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకొని కామెడీని పండించారని సమాచారం.

మాకు ఈ చిత్ర టీం నుంచి అందిన సమాచారం ప్రకారం బ్రహ్మానందం ఆఫ్ఘనిస్తాన్ ని బార్బర్ షాప్ పెట్టుకున్న సుజుకి సుబ్రమణ్యంగా కనిపిస్తాడు, ఆ ఆఫ్ఘనిస్తాన్ ఎపిసోడ్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుందట. అలాగే రీల్ లైఫ్ లో డైరెక్టర్ గా జయప్రకాశ్ రెడ్డి మంచి కామెడీతో నవ్విస్తాడని అంటున్నారు. కచ్చితంగా వీరిద్దరి కామెడీ సినిమాకి బాగా హెల్ప్ అవుతుందని ఈ చిత్ర టీం భావిస్తోంది. వీటన్నిటికీ మించి మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో 5 నిమిషాలు కనిపించనుండడం సినిమాకి మరో హైలైట్ గా నిలవనుంది.

రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో కృతి కర్బంద, నదియా, అరుణ్ విజయ్, రావు రమేష్, పవిత్ర లోకేష్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Exit mobile version