
బ్రహ్మానందం, తెలుగు సినిమా ప్రేక్షకులకు, హాస్య ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. అగ్ర హీరోల సినిమాలలో బ్రహ్మానందం తప్పనిసరి. బ్రాహ్మి లేకపోతే ప్రేక్షకులు ఏదో వెలితిగా ఫీల్ అవుతున్నారు. దర్శకనిర్మాతలు, హీరోలు కూడా బ్రహ్మానందం పాత్రపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. బ్రహ్మానందంపై ప్రత్యేకంగా సినిమాలలో పాటలు కూడా చిత్రీకరిస్తున్నారు. అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి’లో బ్రహ్మానందంపై ఒక పాటను పెడుతున్న సంగతి తెలిసిందే.
‘గీతాంజలి’లో బ్రహ్మానందం పాటకు స్తేప్పులేయడంతో పాడుతున్నారు కూడా. బ్రహ్మానందం పాట పాడడం, డాన్సు చేయడం కొత్త కాదు. పాటలో ఫాస్ట్ బీటులో సాగిపోయే రాప్ పాడుతున్నారు. ప్రముఖ పాప్ సింగర్ బాబా సెహగల్ తో కలసి బ్రాహ్మి రాప్ పాడుతున్నారు. బ్రాహ్మిలో ఈ న్యూ యాంగిల్ ఎలా ఉంటుందో..? అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.