‘భ్రమయుగం’ ఏపీ, తెలంగాణ రిలీజ్ థియేటర్స్ లిస్ట్

‘భ్రమయుగం’ ఏపీ, తెలంగాణ రిలీజ్ థియేటర్స్ లిస్ట్

Published on Feb 15, 2024 12:38 AM IST

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో రాహుల్‌ సదాశివన్‌ దర్శకత్వం వహించిన లేటెస్ట్ హారర్‌ థ్రిల్లర్‌ జానర్‌ మూవీ భ్రమయుగం. ఈ మూవీని నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ బ్యానర్ పై చక్రవర్తి రామచంద్ర, ఎస్‌.శశికాంత్‌ నిర్మించారు. ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ వేడుక ఇటీవల అబుదాబిలో నిర్వహించారు. ఇక ట్రైలర్ ని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేసారు. చాలాకాలం తర్వాత బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫార్మాట్‌లో రూపొందిన ఈ ట్రైలర్‌అందరికీ కొత్త అనుభూతిని అందించి మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచింది.

ఈ మూవీ కథ కేరళలో మాయా తంత్రంతో నిండిన యుగంలో సాగనుండగా, ఒక గాయకుడి జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య ఘటనల నేపథ్యంలో ఇది రూపొందినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మలయాళ వెర్షన్‌ రేపు విడుదల కానుంది. త్వరలోనే మిగతా భాషల్లోనూ విడుదల చేస్తామని మేకర్స్‌ వెల్లడించారు. ఈ మూవీకి కెమెరామ్యాన్ గా షెహనాద్‌ జలాల్‌ వర్క్ చేయగా సంగీతాన్ని క్రిస్టో జేవియర్‌ అందించారు. విషయం ఏమిటంటే, ఈ మూవీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో క్రింది థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి రానుంది.

హైదరాబాద్ : పంజాగుట్ట పివిఆర్ సెంట్రల్ మాల్
హైదరాబాద్ : పీవీఆర్ ఫోరమ్ మాల్
హైదరాబాద్ : సినీ పోలిస్ లులు మాల్
హైదరాబాద్ : ఐనాక్స్ జీఎస్ఎం మాల్
హైదరాబాద్ : సినీ పోలిస్ సిసిపిఎల్ మాల్
హైదరాబాద్ : ప్రసాద్ మల్టిప్లెక్స్
హైదరాబాద్ : ఏఎంబి సినిమాస్
హైదరాబాద్ : సినీ పోలిస్ డీఎస్ఎల్ వర్చు మాల్
వైజాగ్ : ఆర్ కె బీచ్ రోడ్ ఐనాక్స్ వరుణ్ బీచ్
విజయవాడ :మొగల్రాజపురం సినీ పోలిస్ పివిపి స్క్వేర్
కాకినాడ : రమణయ్యపేట ఐనాక్స్ ఎస్ ఆర్ ఎం టి మాల్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు