మమ్ముట్టి “భ్రమయుగం” అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్!

మమ్ముట్టి “భ్రమయుగం” అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్!

Published on Feb 21, 2024 8:02 PM IST

మమ్ముట్టి తాజా హారర్ థ్రిల్లర్ భ్రమయుగం బాక్సాఫీస్ మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. దర్శకుడు రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ శుక్రవారమే తెలుగు వెర్షన్ విడుదల కానుందని ఇప్పటికే సమాచారం అందింది. ఇప్పుడు, తాజా అప్డేట్ ఏమిటంటే, ఈ సినిమాకి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు, తమిళం మరియు కన్నడ భాషలలో కూడా ఫిబ్రవరి 23 న విడుదల కానుంది.

సినిమా ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో చిత్రీకరించబడింది. అర్జున్ అశోకన్ మరియు సిద్ధార్థ్ భరతన్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. క్రిస్టో జేవియర్ సంగీతం సమకూర్చగా, ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ మరియు YNOT స్టూడియోస్ సంయుక్తంగా బ్యాంక్రోల్ చేశాయి. T.D. రామకృష్ణన్ స్క్రీన్‌ప్లే రాయడంలో రాహుల్ సదాశివన్‌కి సహకరించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు