
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలుగులో టాప్ స్టార్స్‌లో ఒకరు. ఇప్పటివరకూ తెలుగులోనే పాపులర్ అయిన ఈ స్టార్, ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయారు. ఒక తెలుగు సినిమా బాలీవుడ్లో సృష్టించిన సంచలనంతో బాహుబలి స్టార్ ప్రభాస్ అంటూ కొత్త బిరుదుతో ప్రపంచానికి పరిచయమయ్యారు ప్రభాస్. ఈ సినిమా ఆయనకు దేశవ్యాప్తంగా తెచ్చిన క్రేజ్‌తోనే మహీంద్ర సంస్థ తమ కొత్త వాహనం టీయూవీ 300కు ప్రభాస్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది.
ఈమధ్యే వైభవంగా ఈ వెహికిల్ లాంచ్ అవ్వడంతో పాటు అదే రోజున ప్రభాస్‌పై చేసిన యాడ్ టీజర్, కొన్ని పోస్టర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్స్‌లో మ్యాన్లీ లుక్‌తో ప్రభాస్ అదరగొడుతున్నారు. ఇక బాహుబలి తెచ్చిన క్రేజ్, కొత్తగా ఓ పెద్ద వ్యాపార సంస్థకు అంబాసిడర్‌గా ఎన్నికవ్వడం లాంటి వాటితో ప్రభాస్ పెద్ద పెద్ద ప్రభాస్ సరికొత్త ఆప్షన్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం మరికొన్ని నేషనల్ బ్రాండ్స్ కూడా ప్రభాస్‌ను అంబాసిడర్‌గా నియమించే విషయమై ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఇక బాహుబలికి పార్ట్ 2 అయిన బాహుబలి ది కంక్లూజన్ విడుదలయ్యాక ప్రభాస్ రేంజ్ మరింత పెరిగిపోతుందనడంలో అతిశయోక్తి లేదు.

