సూపర్ హిట్ టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ !

సూపర్ హిట్ టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ !

Published on Oct 19, 2019 1:00 AM IST

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా ‘రాజా రాణి’ ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘విజిల్’. కాగా దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25 న ఈ సినిమా విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్రం యొక్క ప్రీ-రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 10.6 కోట్లు జరిగింది. విజయ్ మార్కెట్ తో పోల్చుకుంటే ఇది అధిక ధరే. మరి ఈ చిత్రం ఈ మొత్తాన్ని రాబట్టుకోవాలంటే మొదటి రోజు నుండి భారీ కలెక్షన్స్ సాధించాల్సి ఉంది. ఈ సినిమా ట్రైలర్‌ కు మంచి ఆదరణే లభించింది. కానీ గతంలో ఎప్పుడూ విజయ్ సినిమాలకు 7 కోట్లకు మించి కలెక్షన్స్ ను సాధించిన ఘటన లేదు. ఈ లెక్కన ‘విజిల్’కి సూపర్ హిట్ టాక్ వస్తే.. బ్రేక్ ఈవెన్ అవ్వదు.

ఇక విజయ్ అట్లీ కాంబినేష‌న్‌లో విడుద‌లైన తెరి(పోలీస్‌), మెర్స‌ల్‌(అదిరింది) చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలుగా సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరి క‌ల‌యిక‌లో హ్యాట్రిక్ చిత్రంగా బిగిల్‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. న‌య‌న‌తార హీరోయిన్‌ గా న‌టిస్తోన్న‌ ఈ సినిమాను ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌ మెంట్స్ ప‌తాకం పై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. హీరో విజ‌య్‌ కెరీర్‌ లో భారీ బ‌డ్జెట్ చిత్ర‌మిది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు