స్టార్ హీరో హీరోయిన్లు.. సింగిల్ షెడ్యూల్లో సినిమా ముగించాలట

Published on Mar 12, 2020 6:43 pm IST

స్టార్ హీరో హీరోయిన్లతో సినిమా అంటే కొద్దిగా ఎక్కువ సమయమే పడుతుంది. ఫామ్లో ఉన్నవారు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంటారు కాబట్టి ఒకేసారి ఎక్కువ డేట్స్ దొరకడం కష్టం. అందుకే సినిమా ముగించాలంటే దర్శకులకు కనీసం మూడు లేదా నాలుగు షెడ్యూళ్లు పడుతుంది. కానీ బృందా గోపాల్ మాత్రం సింగిల్ షెడ్యూల్లో సినిమా ఫినిష్ చేయాలని భావిస్తున్నారట.

స్వతహాగా కొరియోగ్రఫర్ అయిన బృందా గోపాల్ దర్శకురాలిగా మారుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనుండగా మంచి క్రేజ్ ఉన్న కాజల్ అగర్వాల్, అధితిరావ్ హైదరిలు కథానాయికలుగా నటించనున్నారు. సినిమా ఈరోజే లాంఛ్ కానుంది. ఈ చిత్రాన్ని ఒకే ఒక షెడ్యూల్ ద్వారా పూర్తిచేసేలా ప్లాన్ చేశారట బృందా గోపాల్. ఇలా మొదటి సినిమానే ఆమె ఖచ్చితమైన ప్రణాళికతో, తక్కువ సమయంలో చేయనుండటం అభినందించదగిన విషయం.

సంబంధిత సమాచారం :

More