బుల్లితెర పై “బ్రో” కి రెస్పాన్స్ ఇదే!

బుల్లితెర పై “బ్రో” కి రెస్పాన్స్ ఇదే!

Published on Oct 27, 2023 5:00 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రో ది అవతార్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా డీసెంట్ వసూళ్లను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు లో ప్రసారం అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సంబందించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా వెలువడింది.

ఈ చిత్రంకి 7.24 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది డీసెంట్ రెస్పాన్స్ అని చెప్పాలి. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, రోహిణి తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకత్వం వహించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు