
‘జోష్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన హీరోయిన్ కార్తీక. ఆ తర్వాత నుంచి సౌత్ ఇండియన్ లాంగ్వేజస్ లో చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. కార్తీక త్వరలోనే ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లరి నరేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కార్తీకతో కాసేపు ముచ్చటించాం. కార్తీక ఈ బ్రదర్ అఫ్ బొమ్మాళి గురించి చెప్పిన విశేషాలు మీకోసం..
ప్రశ్న) హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నప్పుడు ఈ సిస్టర్ పాత్ర చేయడానికి గల కారణం ఏమిటి.?
స) మొదట సిస్టర్ రోల్ అని చిన్నగారు చెప్పగానే అమ్మా నో చెప్పేసింది. కాదండి ఒకసారి కథ వినండి అని చెప్పి కథ చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరం కన్విన్స్ అయ్యాము. మామూలుగా హీరోయిన్ అంటే హీరోని లవ్ చెయ్యాలి, పాటల్లో గ్లామరస్ గా కనిపించాలి అంటారు. నాకు ఈ సినిమాలో ఒక హీరోలా డాన్సులు, ఫైట్లు, కామెడీ అండ్ గ్లామరస్ గా కనిపించే చాన్స్ వచ్చింది. హీరోకి సమానంగా ఉండే పాత్ర నాది అయినప్పుడు సిస్టర్ పాత్ర అయినా ఎందుకు వదులుకోవాలి అని ఈ సినిమా చేసాను. ఈ సినిమా చూస్తే మీకు నేను ఈ రోల్ ఎందుకు చేసాననేది బాగా అర్థమవుతుంది.
ప్రశ్న) అల్లరి నరేష్ కి చుక్కలు చూపించే ఈ మూవీలో మీకు జోడీగా ఎవరు కనిపిస్తారు.?
స) ఇప్పటివరకూ ట్రైలర్స్, పోస్టర్స్ లో నాది, నరేష్ మరియు మోనాల్ పాత్రలను మాత్రమేరివీల్ చేసారు. మేము ముగ్గురం కాకుండా నాకు జోడీగా హర్ష వర్ధన్ రాణే కనిపించనున్నాడు. తన పాత్ర ఏంటి అనేది సినిమాలో సస్పెన్స్. చెప్పాలంటే ఈ మూవీకి ముగ్గురు హీరోలు. అది నేను, నరేష్ మరియు హర్షవర్ధన్ రాణే.
ప్రశ్న) బ్రదర్ అఫ్ బొమ్మాళి లో మీ పాత్ర గురించి చెప్పండి.?
స) ఇందులో నా పాత్ర గురించి చెప్పాలంటే ఓక టామ్ బాయ్రోల్ అని చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ లో అంతలా కనిపిస్తే సెకండాఫ్ లో మాత్రం లవ్ వల్ల ఎలా మారుతుంది అనేది చూడొచ్చు. ఈ సినిమాలో నాకు ఇలాంటి పాత్ర ఇచ్చి నా పాత్ర నిడివి ఎక్కడా కట్ చేయకుండా చేసిన అల్లరి నరేష్ , చిన్నికి నా స్పెషల్ థాంక్స్. ఇది కాకుండా కెల్లీ దొర్జే చేసిన కామెడీ ట్రాక్ పెద్ద హైలైట్ అవుతుంది. ఈ సినిమాలో కామెడీ, లవ్, ఎమోషన్, ఫైట్స్, డాన్స్ ఇలా అన్ని చేసాను అందుకే ఈ ఒక్క సినిమా నాకు 100 సినిమాల అనుభవాన్ని ఇచ్చింది.
ప్రశ్న) హీరోయిన్ గా పరిచయం అయిన మీరు తక్కుగా, చాలా సెలక్టివ్ గా చెయ్యడానికి గల కారణం ఏమిటి.?
స) ప్రస్తుతం ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉంటున్నారు. ఒక్కోసారి మంచి పాత్ర రాకపోవచ్చు. అలాగే నేను డబ్బు కోసం సినిమాలు చేయటం లేదు. అమ్మ ఇక్కడ ఉంది, ఆ గౌరవంతో నాకు వచ్చిన వాటిల్లో నాకు నచ్చింది చేస్తున్నాను. అలా అని తమిళ్లోకి వెళ్లి అవకాశాల కోసం ట్రై చెయ్యడం లేదు. నా దగ్గరకు వచ్చిన ఆఫర్స్ లో నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటున్నాను. చాలా సినిమాలకి మనీ కూడా తీసుకోకుండా చేసాను.
ప్రశ్న) మీ మొదటి సినిమాకి మీకు కొంత నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.? దాన్ని మీరెలా తీసుకున్నారు.?
స) మొదటి సినిమా టైంకి నాకు నటన గురించి ఏమీ తెలియదు. జోష్ మూవీ టైములో నాకు అర్థమైంది.. యాక్టింగ్ అంటే జోక్ కాదు అని ఆ తర్వాత సీరియస్ గా తీసుకొని చేసాను. నా వరకూ సక్సెస్ అనేది చాలా ముఖ్యం. సక్సెస్ వస్తే నెగటివ్ ని కూడా పాజిటివ్ గా చెప్తారు. ఉదాహరణకి చెప్పాలంటే మొదటి సినిమా టైంలో నా ఐ బ్రోస్ మైనస్ అన్నారు. కొంత ఫీలయ్యాను. కానీ సెకండ్ మూవీ రిలీజ్ అయ్యాక అదే నాకు ప్లస్ అయ్యింది. ఎందుకంటే చాలా మంది నా స్టైల్లో ఐ బ్రోస్ చేయించుకోవడం మొదలు పెట్టారు.
ప్రశ్న) వేరే ఏదైనా తెలుగు సినిమాకి సైన్ చేసారా.? మిగతా భాషల్లో చేస్తున్న సినిమాలేమిటి.?
స) ప్రస్తుతం తెలుగులో ఏమీ ఓకే చెయ్యలేదు. డిసెంబర్ లో ఆ డీటైల్స్ ఖరారు చేస్తాను. ప్రస్తుతం తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా ‘డీల్’ సినిమా చేస్తున్నాను. అది కాకుండా ఆర్య – విజయ్ సేతుపతి చేస్తున్న ‘పోరంపోక్కు’ లో నటిస్తున్నాను..
ప్రశ్న) ఫైనల్ గా ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు.?
స) ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’ ఒక మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. ఆడియన్స్ కోరుకునే కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. కచ్చితంగా థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ హ్యాపీగాబయ్తకి నవ్వుకుంటూ వచ్చే సినిమా ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’.
అంతటితోకార్తీకతో మా చిట్ చాట్ ని ముగించాం.