ప్రేక్షకాదరణ పొందుతున్న బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

ప్రేక్షకాదరణ పొందుతున్న బ్రదర్ ఆఫ్ బొమ్మాళి

Published on Nov 8, 2014 11:10 AM IST

Brother-of-bommali1
కామెడీ కింగ్ అల్లరినరేష్ నటించిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమా నిన్న విడుదలై మంచి స్పందనను అందుకుంటుంది. నరేష్ కామెడీ టైమింగ్, కార్తీక నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కొత్తగా తెరకెక్కించిన కధ, ప్రతీ సన్నివేశంలో మిస్ అవ్వని ఫన్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్.

విడుదలైన అన్ని థియేటర్ లలో ఈ చిత్రం మంచి స్పందనను అందుకోవడమే కాక అల్లరి నరేష్ కెరీర్ లోనే బెస్ట్ ఓవర్ సీస్ కలెక్షన్ ను సొంతం చేసుకుంది . ఈ చిత్రానికి చిన్ని కృష్ణ దర్శకుడు. మోనాల్ గజ్జర్ హీరోయిన్. బ్రహ్మానందం కోనా వెంకట్ పాత్రలో కడుపుబ్బా నవ్వించాడు.

తాజా వార్తలు