త్వరలో విడుదలకానున్న బ్రూస్ లీ ఆడియో

brusli
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం బ్రూస్ లీ షూటింగ్ లో బిజీగా వున్నాడు. శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో తళుక్కున మెరవనున్న సంగతి తెలిసినదే. డి.వి.వి దానయ్య నిర్మాత.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి సంబంధించిన ఆడియో ఈ నెల చివరివారంలో విడుదలకానుంది. సన్నహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 27న ఆడియో విడుదల వేడుక జరగనుంది. ఈ ఈవెంట్ కి సంబంధిచిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Exit mobile version