ఫుల్ స్వింగ్ మీదున్న చరణ్ ‘బ్రూస్ లీ’ పోస్ట్ ప్రొడక్షన్

ఫుల్ స్వింగ్ మీదున్న చరణ్ ‘బ్రూస్ లీ’ పోస్ట్ ప్రొడక్షన్

Published on Sep 25, 2015 8:25 AM IST

Brucele
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’ దసరా కానుకగా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిదమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. సినిమా రిలీజ్ కి ఇంకా 20 రోజులు మాత్రమే ఉండడంతో ఈ చిత్ర టీం మిగిలిన వర్క్స్ ఫినిష్ చెయ్యడాన్ని వేగవంతం చేసింది. సినిమా షూట్ ని మరో 10 రోజుల్లో ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తూనే, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా స్పీడప్ చేసింది. ప్రస్తుతం డబ్బింగ్, ఎడిటింగ్ మరియు రీ రికార్డింగ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నటీనటుల డబ్బింగ్ వర్క్స్ ఫినిష్ అవ్వగా, త్వరలోనే రామ్ చరణ్ కూడా తన పార్ట్ కి డబ్బింగ్ స్టార్ట్ చేయనున్నాడు.

ఇదిలా ఉంటె మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కానున్న బ్రూస్ లీ ఆడియో ఫైనల్ వెర్షన్ ని రెడీ చేసే పనిలో ఉన్నాడు. ‘ది ఫైటర్’ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడు. వీటితో పాటు మెగా అభిమానులు పండుగ చేసుకునే విషయం మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించనుండడం. చిరు పార్ట్ కి సంబందించిన షూటింగ్ ని ఈ నెల 28,29,30 తేదీలలో షూట్ చేయనున్నారు. రామ్ చరణ్ సరసన రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నదియా, రావు రమేష్, కృతి కర్భంద ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు