లాక్ అయిన రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ రన్ టైం

bruce-lee
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఫ్యామిలీ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న బ్రూస్ లీ సినిమా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రామ్ చరణ్ నుంచి ఏడాది గ్యాప్ తర్వాత వస్తున్నా సినిమా కావడం ఈ సినిమా క్రేజ్ కి ఒక కారణం అయితే, దాదాపు 7 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మరోసారి వెండితెరపై కనిపించనుండడం ఈ సినిమాకి మరో మేజర్ అట్రాక్షన్ గా మారింది. మెగా అభిమానులంటీ చరణ్ ఎలా గు ఇరగదీస్తాడు, చరణ్ కి మించి చిరు అదరగొడటాడని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్ర టీం ఫైనల్ రన్ టైం ని లాక్ చేసింది. ధూమపానం యాడ్స్ తో కలుపుకొని ఈ సినిమా నిడివి 146 నిమిషాలు. ఇందులో సుమారు 5 నిమిషాలు చిరంజీవి కనిపించి ఆడియన్స్ ని థ్రిల్ చేయనున్నాడు. డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాని ఎక్కడా సాగదీయకుండా చాలా ఫాస్ట్ గా చెప్పడానికి ట్రై చేసాడని సమాచారం. రామ్ చరణ్, శ్రీనువైట్ల అండ్ టీం ఈ సినిమా సక్సెస్ పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నదియా, కృతి కర్భంద, అరుణ్ విజయ్, రావు రమేష్ లు ముఖ్య పాత్రలు పోషించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version