తేజు ‘చిత్రలహరి’కి బడ్జెట్ తగ్గించారా ?

Published on Feb 6, 2019 3:40 am IST


‘సుప్రీమ్’ తరువాత సాయి ధరమ్ తేజ్ కి సరైన విజయం దక్కలేదు. ఈ చిత్రం తరువాత చేసిన 6 చిత్రాలు డిజాస్టర్లు కావడంతో తేజు మార్కెట్ బాగా పడిపోయింది అయితే ఈ ప్రభావం సాయి ధరమ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘చిత్రలహరి’ ఫై పడింది. ముందుగా ఈ చిత్రానికి 20కోట్ల బడ్జెట్ అనుకున్నారట కాని తేజు మార్కెట్ చూసి 15కోట్ల వరకే కేటాయించేలా ఫిక్స్ అయ్యారట మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు. ఇక ఈసినిమా థియేట్రికల్ హక్కులను కూడా రీజనబుల్ రేట్స్ కు అమ్మి శాటిలైట్ , డిజిటల్ రైట్స్ తో లాభాలు రాబట్టాలన్న ఆలోచనలో వుంది మైత్రి.

కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కళ్యాణి ప్రియదర్శన్ ,నివేత పేతురాజ్ కథానాయికలుగా నటిస్తుండగా ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :