బుజ్జి అండ్ భైరవ: నేడు రాత్రి నుండి స్ట్రీమింగ్ కి 2 ఎపిసోడ్స్!

బుజ్జి అండ్ భైరవ: నేడు రాత్రి నుండి స్ట్రీమింగ్ కి 2 ఎపిసోడ్స్!

Published on May 30, 2024 8:17 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898AD చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇండస్ట్రీ లో ఈ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రం ను ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ కి ఏ మాత్రం తగ్గకుండా సినిమా రిలీజ్ కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బుజ్జి అండ్ భైరవ టైటిల్ తో యానిమేటెడ్ సిరీస్ అమేజాన్ ప్రైమ్ వీడియో లో రానున్న సంగతి అందరికీ తెలిసిందే.

ప్రైమ్ వీడియో లో ఈ సిరీస్ కి సంబందించిన రెండు ఎపిసోడ్స్ నేడు రాత్రి నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనున్నాయి. మిగతా రెండు ఎపిసోడ్స్ కల్కి చిత్రం రిలీజ్ తర్వాత అందుబాటులోకి రానున్నాయి. దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రంకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 27, 2024న రిలీజ్ కానున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు