కల్కి: ‘బుజ్జి-భైరవ’ల ట్రైలర్.. యానిమేషన్‌లోనూ యాక్షన్ అదుర్స్!

కల్కి: ‘బుజ్జి-భైరవ’ల ట్రైలర్.. యానిమేషన్‌లోనూ యాక్షన్ అదుర్స్!

Published on May 30, 2024 4:35 PM IST

తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ‘కల్కి 2898 ఎడి’ మరికొద్ది రోజుల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్స్‌ను నెక్ట్స్ లెవెల్‌లో చేపడుతూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. కాగా, ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు. ఈ సినిమాలో భైరవ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, ఆయనకు తోడుగా బుజ్జి అనే ఫ్యూచరిస్టిక్ రోబోటిక్ కారు కూడా కనిపిస్తుంది. బుజ్జి, భైరవల మధ్య నడిచే ట్రాక్ సినిమా లవర్స్‌ను కట్టిపడేయనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

కాగా, ఈ సినిమా రిలీజ్‌కు ముందే యానిమేషన్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. మే 31న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ యానిమేషన్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. యానిమేషన్‌లోనూ యాక్షన్ డోస్ ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్ కట్ ఉండటంతో ప్రేక్షకుల్లో దీనిపై భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి. భైరవ, బుజ్జిల బాండింగ్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండనుందని ఈ ట్రైలర్ కట్ చూస్తే అర్ధమవుతోంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఈ యానిమేషన్ సిరీస్ రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇక ఈ యానిమేషన్ సిరీస్‌ను కూడా కల్కి యూనిట్ చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకుంది. బుజ్జి కారుకు వాయిస్ ఓవర్ ఇచ్చింది మరెవరో కాదు.. అందాల భామ కీర్తి సురేష్. దీంతో ఈ యానిమేషన్ సిరీస్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు మరింత ఆతృతగా చూస్తున్నారు. ఇక ‘కల్కి 2898 ఎడి’ థియేట్రికల్ రిలీజ్‌ను జూన్ 27న భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు