కల్కి: బుజ్జి థీమ్ మ్యూజిక్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం!

కల్కి: బుజ్జి థీమ్ మ్యూజిక్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం!

Published on May 27, 2024 5:17 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏ.డి (Kalki 2898AD). దీపికా పదుకునే, దిశా పటానిలు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం రికేజ్ డేట్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే బుజ్జి x భైరవ ఈవెంట్ ను నిర్వహించగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. బుజ్జి రోల్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే బుజ్జి థీమ్ మ్యూజిక్ వీడియో ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 27, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు